గుంటూరు జిల్లా కోర్టులో ఉద్రిక్తత

73చూసినవారు
గుంటూరు జిల్లా కోర్టులో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకటవ నెంబర్ గేటు వద్ద పోలీసులకు, న్యాయవాదులకు మధ్య గొడవ జరిగింది. ఉద్యోగరీత్యా వచ్చిన పోలీసులను గో బ్యాక్ పోలీసు అంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు. ఉన్నతాధికారులకు చెప్పాలి అనే ఉద్దేశ్యంతో కానిస్టేబుల్ వీడియో రికార్డు చేశారు. ఒక్కసారిగా న్యాయవాదులు పోలీసుల మీదకు దూసుకొచ్చారు. వీడియో డిలీట్ చెయ్యాలని, కానిస్టేబుల్ పైకి న్యాయవాదులు బలవంతంగా వెళ్ళారు. దీంతో ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ జడ్జి పార్థసారధి రాకతో గొడవ సద్దుమణిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్