గురజాలలో తోపుడు బండ్ల వద్ద కొంతమంది వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఉప్పు బ్రహ్మం అనే వ్యక్తి చేసిన వీడియో వైరలైన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. అధికారులను పంపించి బాధితుడు వద్ద షాప్ యజమాని వసూళ్లు చేసిన డబ్బును తిరిగి ఇప్పించారు. బండి పెట్టుకునేందుకు స్థలాన్ని కేటాయించి యరపతినేని తనకు సాయం చేశారని చెప్పారు.