గత పాలకులు రాష్ట్రంలోని గుంతలను పూడ్చలేక రహదారులను మృత్యు గంటికలుగా మార్చారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఏపీ గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గురజాల నుంచి చర్లగుడిపాడు గ్రామం వరకు రహదారిలో ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.