గురజాల నియోజకవర్గం పంచాయతీ రాజ్ నూతన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా ఎస్. కోటేశ్వరరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు ఎక్కడ ఉన్నా సరే వాటిని పరిష్కరించే విధంగా పని చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు.