మున్సిపల్ కమిషనర్ పార్వతినేని శ్రీధర్ శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. గురువారంపిడుగురాళ్ల పట్టణంలోని ఎస్టీ కాలనీలో శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శానిటేషన్ సక్రమంగా జరగకపోవడంతో పాటు ప్రజలు ఇంటి పరిసరాల్లో పిచ్చి మొక్కలను పట్టించుకోవడం లేదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి కీలకమని తెలిపారు.