దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ కార్యాలయం వద్ద సోమవారం క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. పెద్ద ముగ్గుతో మనిషి పోలిన పెద్ద బొమ్మ వేసి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనపై అధికారులు స్పందించి ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.