పిడుగురాళ్ల పట్టణంలోని 4వ వార్డులో దీపం-2 పథకాన్ని కలెక్టర్ అరుణ్ బాబు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న కూడా సీఎం చంద్రబాబు వల్లే సూపర్-6 హామీల అమలు సాధ్యమవుతుందన్నారు. మహిళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.