కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పిడుగురాళ్ల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో దేవరంపాడు కొండనేతి వెంకన్నస్వామి వారి దేవాలయం వద్ద ఆదివారం నిర్వహించిన రజక సంఘం కార్తీక వన సమారాధన (వనభోజనాలు) మహోత్సవంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వన సమారాధన సామాజిక ఐక్యతకు ప్రతీక అన్నారు. వన సమారాధన నిర్వహించుకోవడం వల్ల సామాజిక అభివృద్ధి జరుగుతుందన్నారు.