మాచర్ల మండలం కంభంపాడు గ్రామ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెంటచింతల నుంచి మాచర్ల వస్తున్న ఆటో గేదెను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెంటచింతలకు చెందిన కత్తి సుబ్బయ్య (50) మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు రిఫర్ చేశారు.