పల్నాడు జిల్లా మాచర్లలో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రవికుమార్ అనే యువకుడిపై ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవికుమార్ 108లో ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బంధువులు నరసరావుపేట తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. ఈ మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.