డయేరియా వ్యాధిని అరికట్టాలి: కలెక్టర్, ఎమ్మెల్యే

76చూసినవారు
పిడుగురాళ్లలో డయేరియా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆర్ అండ్ బి బంగ్లాలో అధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా డయేరియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. పరిపాలనాపరమైన అంశాలపై కూడా అధికారులతో యరపతినేని సమీక్షించారు. గురజాల ఆర్డీవో రమణా కాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్