కారంపూడి విఆర్ఓ గా కోట. దేవదాసును నియమిస్తూ బుధవారం జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు కోట. దేవదాసు విఆర్ఓ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు కారంపూడి విఆర్ఓ గా పనిచేసిన ఎం. కృష్ణప్రసాద్ దాచేపల్లి బదిలీ కాగా దాచేపల్లి విఆర్ఓ గా పనిచేస్తున్న దేవదాసు కారంపూడి బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు.