మాచర్ల: సాగర్ ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

61చూసినవారు
మాచర్ల మండలం నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్స్ నుంచి ప్రాజెక్ట్ అధికారులు నీటి విడుదలను శుక్రవారం కొనసాగించారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 73652 క్యూసెక్కుల నీరు ఇన్ ప్లో గా వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32360 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589. 90 అడుగులుగా ఉందని, ఇది 311 టీఎంసిలకు సమానమని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్