ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికి సామాజిక పింఛన్లను 1వ తేదీనే అందజేస్తామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం మాచర్ల పట్టణంలోని పలు వార్డులలో ఆయన లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.