మాచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట ట్రాన్స్ జెండర్ల నిరసన

51చూసినవారు
మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ట్రాన్స్ జెండర్లు గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు. బుధవారం మాచర్ల పట్టణంలోని యానాది కాలనీలో ట్రాన్స్ జెండర్ సంజనపై చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దాడి చేశారని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన దగ్గర రూ. 3లక్షలు తీసుకొని తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి దాడి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్