మంగళగిరి: ఆ వీర మహిళకు పూలమాలతో స్వాగతం పలకండి: డిప్యూటీ సీఎం
కర్నూల్ జిల్లా ఆదోని నుండి మంగళగిరి జనసేన కార్యాలయానికి 487 కి.మీ సైకిల్ యాత్ర చేస్తున్న రాజేశ్వరి అనే వీర మహిళను పూలమాలతో స్వాగతించాలని డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయానికి ఆదివారం ఆదేశించారు. ఆ వీర మహిళ తన ప్రాంత సమస్యలపై డిప్యూటీ సీఎం ను కలిసేందుకు వస్తున్నట్లు సమాచారం. కాగా ఆమె యాత్రను జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పంచుకోగా.. డిప్యూటీ సీఎం ఇలా తనదైన స్టైల్ లో స్పందించారు.