సినీ పరిశ్రమకు చేసిన కృషికి గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుnit ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సినీ పరిశ్రమ గురించి పలు అంశాలను ఇద్దరు కాసేపు చర్చించారు. సినీ పరిశ్రమ గురించి పూర్తి అవగాహన కలిగిన దిల్ రాజును ఎఫ్డీసి ఛైర్మన్ గా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుధాకర్ కృతఙ్ఞతలు తెలిపారు