వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు మంగళగిరి కోర్టు షాక్ ఇచ్చింది. బీజేపీ నేతలపై దాడి కేసులో అతనికి పోలీసు కస్టడీ అనుమతిస్తూ, జ్వరం ఉన్నప్పటికీ విచారణకు హాజరుకాలేనని తెలిపినా కోర్టు వెళ్లాల్సిందేనని ఆదేశించింది. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ ని విచారించేందుకు మంగళగిరి పోలీసులు మంగళవారం అన్ని ఏర్పాట్లు చేశారు.