మంగళగిరి మండల పరిధిలోని ఏపీఎస్పీ 6వ పటాలములో మంగళవారం 34వ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. మూడు రోజులు పాటు జరిగే కార్యక్రమాన్ని ఏపీఎస్పీ డీఐజీ బి. రాజకుమారి ప్రారంభించారు. తొలుత క్రీడాకారుల మార్చు ఫాస్ట్ ను తిలకించారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ కే. నగేష్ బాబు, అడిషనల్ కమాండెంట్ డి. ఆశీర్వాదం, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, ఆక్టోపస్ కమాండెంట్ రవిచంద్ర, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.