మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసెల్ సిస్టం) కార్యక్రమంలో భాగంగా ప్రజలు నుంచి కమిషనర్ అలీం భాషా వినతులు స్వీకరించారు. పలు సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించిన ఆయన పలు సమస్యలపై నిర్దేశిత గడువులోగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.