సీఎం చంద్రబాబుతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని మంత్రి సవిత అన్నారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమెను నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని అన్నారు.