నరసరావుపేటకు చెందిన గుండాల రాకేష్ కు గుఱ్ఱం జాషువా సాహిత్య పురస్కారంతో పాటు సాహితీ విద్యారత్న బిరుదు ప్రదానం చేస్తున్నట్లు పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళాపరిషత్ ప్రకటించింది. ఈనెల 24న గుర్రం జాషువా 51 వర్ధంతి సందర్భంగా తెనాలిలోని కవిరాజపార్కులో గల సీనియర్ సిటిజన్ హాల్లో జరుగు కార్యక్రమములో ఈ పురస్కారాన్ని, బిరుదును ప్రధానం చేయనున్నట్లు కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దేటి యోహాను తెలిపారు.