సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ గౌరవాన్ని కాపాడేలా కార్యకర్తలు, నాయకులు నడుచుకోవాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. నరసరావుపేటలోని కార్యాలయంలో శుక్రవారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కార్యకర్త అయితే నెలకు రూ. లక్ష, నాయకుడు అయితే రూ. కోటి సంపాదించాలని ఆలోచనలు చేస్తున్నారని, అది ఏమాత్రం సాద్యం కాదన్నారు. అర్హులందరికీ న్యాయం జరిగే విధంగా పనిచేయాలన్నారు.