పల్నాడు: త్రికోటేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

64చూసినవారు
పల్నాడు జిల్లాలో పంచారామాలలో ఒకటైన ప్రసిద్ధిగాంచిన నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా త్రికోటేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆలయంలో మహిళలు దీపారాధన చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్