పల్నాడు: రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుపోయిన వ్యక్తి
చావనైనా చస్తా అంటూ రైలు పట్టాలపై తలపెట్టి నరసారావుపేటకు చెందిన వలి అనే బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నరసారావుపేట సీఐ రామకృష్ణ, కానిస్టేబుల్ బాబు తనను వేధిస్తున్నారని, తనకు చావే శరణ్యమని వాపోతూ వీడియో రికార్డు చేసి బుధవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేశ్, జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. తన చావుకు సీఐ రామకృష్ణనే కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.