గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వచ్చిన టిప్పర్ వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్తంభం విరిగిపోయి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఫలితంగా నాలుగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులకు సమాచారం అందించినా.. స్పందించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, పెద్దగా ఆస్థి నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపరి పీల్చుకున్నారు.