వివాదంలో మరో టీడీపీ ఎమ్మెల్యే!

55చూసినవారు
వివాదంలో మరో టీడీపీ ఎమ్మెల్యే!
ఎమ్మెల్యేల తీరు కూటమి ప్రభుత్వానికి పెద్ద సంకటంగా మారింది. ఇప్ప‌టికే స‌త్య‌వేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గెలిచిన దగ్గర నుంచి ఆయ‌న వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే కారణంగా టీడీపీ సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం చేయడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్