ఏపీలో మళ్లీ వానలు మొదలయ్యాయి. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, కోనసీమ ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా , గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది