రేషన్‌ షాపుల హేతుబద్ధీకరణ

64చూసినవారు
రేషన్‌ షాపుల హేతుబద్ధీకరణ
AP: కీలకమైన రేషన్‌ షాపుల హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్‌)కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2,774 కొత్త రేషన్‌ షాపులు ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రస్తుతం ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుకాణాలకు డీలర్లను నియమించనుంది. చౌకధరల దుకాణాల రేషనలైజేషన్‌, కొత్త షాపుల ఏర్పాటు, డీలర్ల నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ జి.వీరపాండియన్‌ ఇటీవల విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్