ఇంకొల్లు: కోడి పందెం శిబిరంపై మెరుపు దాడి

61చూసినవారు
ఇంకొల్లు: కోడి పందెం శిబిరంపై మెరుపు దాడి
ఇంకొల్లు మండలం పావులూరు గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్నారని సమాచారంతో సోమవారం ఎస్సై సురేష్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండు పందెం కోళ్ళు, 1300 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్