కారంచేడులో డాక్టర్ రామానాయుడు ఇండోర్ స్టేడియం నందు ఆదివారం షటిల్ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని షటిల్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు ఆటలో గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలని ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. అనంతరం ఆయన కొద్దిగా సేపు క్రీడాకారులతో షటిల్ ఆడారు.