డివైడర్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
పెదకాకాని-కొప్పురావు అడ్డరోడ్డు సమీపంలో నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సుకు ప్రమాదానికి గురైంది. గుంటూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి ఎక్కి సుమారు 100 మీటర్లు దూరం ప్రయాణించింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై డ్రైవర్ స్పందిస్తూ.. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో ఇలా జరిగిందని తెలిపారు.