పెదకూరపాడు: ఆడబిడ్డల సంక్షేమమే టిడిపి లక్ష్యం

73చూసినవారు
పెదకూరపాడు: ఆడబిడ్డల సంక్షేమమే టిడిపి లక్ష్యం
ఆడబిడ్డల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అత్తిమల్ల రమేష్ అన్నారు. శుక్రవారం పెదకూరపాడులోని గ్యాస్ ఏజెన్సీ దగ్గర మహిళలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారంతా  ఉచిత గ్యాస్ కి అర్హులే అన్నారు. తహసిల్దార్ దానియేలు, ఎంపీడీవో రామకృష్ణ, నేతలు రాంగోపాల్రావు, పెదకూరపాడు సర్పంచ్ గుడిపూడి రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్