కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అమరావతి మండలం స్థానిక అమరావతి అమరేశ్వరాలయంకి ఆనుకుని వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అమరావతిలోని పల్లపు వీధి, ముస్లిం కాలనీలోకి భారీగా వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పై సుమారు ఐదు అడుగుల మేర వరద నీరు నిలిచింది.