అమరావతి మండల పరిధిలోని మల్లాది గ్రామంలో కృష్ణానది పొంగిపొర్లి గ్రామంలోకి మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహిస్తోంది. స్థానిక టీడీపీ నేత భవిరి వెంకటేశ్వరరావు పురవీధుల్లో ఆదివారం రాత్రి బోటు వేసుకుని తిరుగుతూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అవగాహన కల్పించారు.