నరసరావుపేటలో మున్సిపాలిటీలో రాజకీయ వేధింపులతో విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను, కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయు జిల్లా మహిళా కోశాధికారి శివకుమారి డిమాండ్ చేశారు. సోమవారం నరసరావుపేటలో దీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, స్పందించకపోతే పోరాడుతామని హెచ్చరించారు.