అన్నదాత సుఖీభవ పదకం ద్వారా పంట పెట్టుబడి సహాయం 20 వేల రూపాయలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతు సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దర్శి శేషారావు, ప్రతినిధులుతో కలిసి పెదకూరపాడు తహసిల్దార్ దానియల్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రతినిధులు ఎం మస్తాన్రావు, వై నరేంద్రబాబు, పి నాగమల్లేశ్వరరావు, ఎన్ శ్రీకాంత్, దావీదు తదితరులు పాల్గొన్నారు.