పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని వికలాంగులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో పొన్నూరు వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యంగుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వికలాంగులకు రూ. 6 వేలు పెంచిందని సంక్షేమ సంఘం డిమాండ్స్ ను నెరవేరుస్తానని పేర్కొన్నారు.