గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను గురువారం ఎంఈఓ శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల విద్యాసనా అభివృద్ధిని పరీక్షించారు. ఈ ఏడాది గణితంలో అదనపు సిలబస్ పై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది పదిలో నూరు శాతం ఫలితాలు సాధించాలని అధ్యాపకులకు సూచించారు.