పొన్నూరు: మందకృష్ణ నీ డ్రామాలు తెలంగాణలో వేసుకో
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ జనసేన నేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని శుక్రవారం పొన్నూరు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు యరసాని నాగభూషణం ఖండించారు. కులాన్ని అడ్డుపెట్టుకొని సూట్ కేసులు తీసుకెళ్లే వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ ని విమర్శించటం హాస్యాస్పదమన్నారు. పీఎం మోది పవన్ కళ్యాణ్ ను ప్రశంసించటం యావత్ ప్రపంచం చూసిందని పేర్కొన్నారు. నీ డ్రామాలు తెలంగాణలో వేసుకో అని హెచ్చరించారు.