గుంటూరు జిల్లా పొన్నూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ పరిధిలో నూతన మద్యం పాలసీ దరఖాస్తుల స్వీకరణ చివరి రోజు శుక్రవారం వరకు 258 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ సీఐ రమేష్ మీడియాకు తెలిపారు. ఈనెల 14న గుంటూరు విజ్ఞాన మందిరంలో కలెక్టర్ నాగలక్ష్మి లాటరీ పద్ధతి ద్వారా నూతన మద్యం పాలసీ దుకాణాలను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. స్టేషన్ పరిధిలో మొత్తం 12 దుకాణాలు ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు.