పొన్నూరు: వైభవంగా శ్రీ వాసవి అమ్మవారి గ్రామోత్సవం

62చూసినవారు
దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం పొన్నూరు పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని గ్రామోత్సవంగా ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, వివిధ అమ్మవారి వేషధారణ ప్రదర్శనలతో పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం జరిగింది. అమ్మవారిని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కారుమూరి ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

సంబంధిత పోస్ట్