Sep 15, 2024, 02:09 IST/మానకొండూర్
మానకొండూర్
మానకొండూరులో శరవేగంగా విస్తరణ పనులు
Sep 15, 2024, 02:09 IST
వరంగల్-నిజామాబాద్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రస్తుతమున్న రెండు వరసల రహదారి విస్తరణ పనులు శనివారం వేగంగా కొనసాగుతున్నాయి. మానకొండూరు మండల కేంద్రంతో పాటు సదాశివపల్లి గట్టు దుద్దేనపల్లి తదితర గ్రామాల్లో అవసరమైన చోట్ల కల్వర్టులు, బ్రిడ్జిలు తదితర నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. రహదారి విస్తరణ పనులు పూర్తయితే మండలం పరంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.