పెదనందిపాడు మండలం అన్నారం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పర్యటించారు. ఓగేరు వాగును పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓగేరు, గుంటూరు ఛానల్ , నల్లమడ వాగు అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలుస్తామని మీడియాకు తెలిపారు. ఓగేరు వాగు పై వంతెన నిర్మాణం చేయడం వలన పలు గ్రామాలకు రవాణా అనుసంధానంగా ఉంటుందని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం లో రివర్స్ టెండర్లుతో అభివృద్ధి కుంటుపడిందన్నారు.