మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 100వ జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల వరగాని గ్రామంలో బుధవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల బిజెపి శ్రేణులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొని వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశానికి మాజీ ప్రధాని వాజ్ పేయి చేసిన సేవలను కార్యక్రమంలో కొనియాడారు.