గుంటూరు జిల్లా కాకుమాను మండల కేంద్రంలోని నన్నపనేని జడ్పీ పాఠశాలలో.. శుక్రవారం మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెలక్షన్స్ అండర్-14, అండర్ -17 క్రీడా పోటీలను మండల ఎంఈఓ కె ఎఫ్ కెనడి ప్రారంభించారు. కాకుమాను, రేటూరు, చిన్న లింగాయపాలెం, కొమ్మూరు గరికపాడు జడ్పీ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వాలీబాల్, కబడ్డీ, కోకో, యోగ, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు.