ప్రతిపాడు; ఎరువుల దుకాణాలు తనిఖీ
గుంటూరు జిల్లా కాకుమాను మండల కేంద్రంలో బుధవారం మంగళగిరి ఏడిఏ జి శ్రీనివాసరెడ్డి, కాకుమాను ఏవో కిరణ్మయి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. షాపుల్లో ఎరువులు, పురుగు మందులకు సరైన పత్రాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే అమ్మకాలు జరపాలని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు లేని రూ. 23 వేల పురుగుమందులను నిలుపుదల చేసినట్లు ఏడీఏ తెలిపారు.