రైలు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన ప్రయాణికులు లోకో పైలట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి.. రైలు ఇంజన్ కిటికీ అద్దాలను పగలగొట్టారు. కొందరు ప్రయాణికులు రైలు ఇంజన్‌ను ధ్వంసం చేయడంతో పాటు పైలట్‌ను దుర్భాషలాడారు. మధ్యప్రదేశ్ జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నవంబర్ 15న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.