చెరుకుపల్లి: కురప్పాలెంలో చోరీ ఘటన

81చూసినవారు
చెరుకుపల్లి: కురప్పాలెంలో చోరీ ఘటన
చెరుకుపల్లి మండలం ఆరేపల్లి పంచాయతీలోని కురప్పాలెం గ్రామంలో సోమవారం చోరీ జరిగింది. కురప్పాలెం గ్రామానికి చెందిన బక్కా బసవయ్య కుటుంబ సభ్యులతో కలిసి వారం క్రితం గుంటూరు వెళ్ళాడు. గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి, లోపలికి ప్రవేశించి బీరువా లోపల ఉన్న బంగారు చైను, ఉంగరం, ఏడువేల రూపాయలు నగదు, నాలుగు చీరలు దొంగిలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్