నిజాంపట్నం రొయ్యల ఫ్యాక్టరీలో లీక్ అయిన విషవాయువులు

83చూసినవారు
నిజాంపట్నం రొయ్యల ఫ్యాక్టరీలో లీక్ అయిన విషవాయువులు
నిజాంపట్నం లోని గోకర్ణమఠంలోని రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో శనివారం విషవాయువులు ఒక్కసారిగా లీక్ అయ్యాయి. విషవాయువులు లీక్ అవడంతో అక్కడ పని చేస్తున్న 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని దగ్గరలోని పిట్టలవానిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ కంపెనీ లో 500 మంది వరకు పని చేస్తున్నారు. విషవాయువుల లీక్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్